Sunil Gavaskar backs Rishabh Pant to become successful captain
#Rishabhpant
#SunilGavaskar
#Teamindia
#Pant
#WTCFinal
#DelhiCapitals
#Ipl2021

యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టీమిండియా భవిష్యత్తు సారథి అనడంలో ఎలాంటి సందేహం లేదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను పంత్ చక్కగా ముందుకు నడిపించాడని ఆయన ప్రశంసించారు. జట్టును గెలిపించాలన్న జ్వాల, నేర్చుకొనే తపన అతడిలో కనిపించాయని సన్నీ తెలిపారు. పలు జట్లలో కరోనా కేసులు వెలుగు చూడడంతో బీసీసీఐ టోర్నీని నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో మిగిలిన టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది.